Varla Ramaiah: జగన్ అనుకూలురుగా ముద్రపడిన అధికారులపై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

Varla Ramaiah shocking comments on senior officials
  • రామాంజనేయులు, సునీల్, సంజయ్, జవహర్ రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు
  • బాధ్యతలు విస్మరించి పని చేశారని మండిపాటు
  • వీరి పరిస్థితి భావి అధికారులకు గుణపాఠం కావాలని వ్యాఖ్య
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు కొందరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వీరవిధేయులుగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆ జాబితాలో ఉన్న పలువురు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ... వారికి కనీసం అపాయింట్ మెంట్ కూడా లభించడం లేదు. ఈ క్రమంలో కొందరు అధికారులను ఉద్దేశించి ఎక్స్ వేదికగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 

'బాధ్యతలు విస్మరించి, విధి నిర్వహణలో నేల విడిచి సాముచేసిన సీనియర్ అధికారులు రామాంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్, జవహర్ రెడ్డి తదితరుల ప్రస్తుత పరిస్థితి జాతీయ స్థాయి భావి అధికారులకు గుణపాఠం కావాలి. వారి ట్రైనింగ్ లలో పాఠ్యంశాలుగా చేర్చాలి. సమాజానికి మార్గదర్శకులుగా తీర్చిదిద్దాలి' అని ఆయన ట్వీట్ చేశారు.
Varla Ramaiah
Telugudesam
Jawahar Reddy
Jagan

More Telugu News