Stock Market: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
- లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- 36 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 3 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలతో ఈ ఉదయం మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అయితే ఇంట్రాడేలో కాస్త కోలుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 36 పాయింట్లు కోల్పోయి 79,960కి పడిపోయింది. నిఫ్టీ 3 పాయింట్లు నష్టపోయి 24,320 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (2.27%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.55%), నెస్లే ఇండియా (1.14%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.92%), టాటా మోటార్స్ (0.87).
టాప్ లూజర్స్:
టైటాన్ (-3.54%), అదానీ పోర్ట్స్ (-1.65%), టాటా స్టీల్ (-1.40%), ఏసియన్ పెయింట్స్ (-1.31%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.21%).