Mallu Bhatti Vikramarka: మంగళగిరిలో వైఎస్ జయంతి వేడుకలు... గన్నవరం చేరుకున్న రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క

Revanth Reddy will attend YSR Jayanthi program in Mangalagiri
  • ముఖ్య అతిథులుగా హాజరవుతున్న తెలంగాణ సీఎం, ఉపముఖ్యమంత్రి
  • హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న రేవంత్, భట్టివిక్రమార్క
  • కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న వైఎస్ రాజశేఖరరెడ్డి 75 జయంత్యుత్సవాలకు హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. మంగళగిరిలో వైఎస్సార్ జయంతి కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రేవంత్, భట్టివిక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. వారు గన్నవరం నుంచి మంగళగిరి కార్యాలయానికి చేరుకోనున్నారు.

ప్రారంభమైన జయంతి కార్యక్రమం

మంగళగరిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే మాజీ మంత్రి, తెలంగాణ నేత షబ్బీర్ అలీ, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ తదితరులు హాజరవుతున్నారు.
Mallu Bhatti Vikramarka
Revanth Reddy
YS Sharmila
Andhra Pradesh
Telangana

More Telugu News