Seethakka: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క

Seethakka inaugurated Indira Shakti Canteen in Mulugu
  • గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్న మంత్రి
  • రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి
  • వివిధ రకాల ఆహార పదార్ధాలతో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి
ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మంత్రి సీతక్క మంగళవారం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ... గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో వారికి కావాల్సిన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. స్థానికంగా మొత్తం నాలుగు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అందులో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో మొదటి క్యాంటీన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ రకాల ఆహార పదార్ధాలతో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మహిళా శక్తి క్యాంటీన్‌లలో ఆహారం అమ్మ చేతి వంటలా ఉండాలన్నారు. నాణ్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
Seethakka
Congress

More Telugu News