Sajjala Ramakrishna Reddy: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు... ముందస్తు బెయిల్ కోరుతూ సజ్జల పిటిషన్!
- వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి
- కర్రలు, రాడ్లతో విధ్వంసానికి పాల్పడిన వ్యక్తులు
- నేడు దేవినేని అవినాశ్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు
- రేపు ప్రభుత్వ వాదనలు వినాలని నిర్ణయం
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగడం తెలిసిందే. ఈ కేసులో దేవినేని అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు... ప్రభుత్వ వాదనలు వినడం కోసం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఈ కేసులో నేడు మరి కొన్ని ఆసక్తికర పరిణామాలు కూడా చేసుకున్నాయి. ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.
అటు, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో, మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.