Girl Gangrape: నంద్యాల జిల్లాలో బాలికపై మైనర్ల గ్యాంగ్ రేప్.. హత్య

Eight Year Old Girl Gang Raped By Three Minors In Nandyal District
  • మూడు రోజులుగా కనిపించని బాలిక
  • మిస్సింగ్ కేసు దర్యాఫ్తులో బయటపడ్డ దారుణం
  • నిందితులు ముగ్గురూ ఆరు, ఏడో తరగతి బాలురే
  • అత్యాచారం చేసి బాలికను కాలువలో పడేసిన నిందితులు
నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై హైస్కూలు విద్యార్థులు ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై బాలికను కాల్వలోకి తోసేసి వెళ్లిపోయారు. బిడ్డ కనిపించలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు ఫైల్ చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. జాగిలాలను రంగంలోకి దింపడంతో ఈ ఘోరం బయటపడింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న బాలిక మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ప్రాంతాలు, తెలిసిన వాళ్ల ఇళ్లల్లో వెతికిన తల్లిదండ్రులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులకు తొలుత ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో జాగిలాలను రంగంలోకి దించారు. బాలికకు చెందిన డ్రెస్ వాసన చూపించి వదిలిపెట్టగా.. ఆ శునకాలు ముందు గ్రామ శివార్లలోని కాల్వ ఒడ్డుకు, అక్కడి నుంచి ముగ్గురు బాలుర ఇంటి వద్దకు తీసుకెళ్లాయి. ఆ ఇంట్లోని ముగ్గురు బాలురు కూడా బాలిక చదివే పాఠశాలలోనే ఆరు, ఏడో తరగతి చదువుతున్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెల్లడించారు.

బాలికపై తాము అత్యాచారం చేశామని ఆ ముగ్గురు బాలురు తెలిపారు. ఆ తర్వాత భయపడి బాలికను చంపి కాల్వలో పడేశామని పోలీసులకు చెప్పారు. దీంతో బాలిక మృతదేహం కోసం పోలీసులు కాల్వలో గాలిస్తున్నారు. ముగ్గురు నిందితులూ పన్నెండు, పదమూడేళ్ల వయసున్న వారే, అయినప్పటికీ ఇంత ఘోరానికి పాల్పడడం గ్రామస్థులను నివ్వెరపరిచింది.  
Girl Gangrape
Missing Girl
Nandyal
School Boys
Gang Rape Murder

More Telugu News