Sajjanar: టీజీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ అంటూ ప్రచారం... అదంతా ఫేక్ అన్న సజ్జనార్

Sajjanar tweet about TGSRTC notification
  • సంస్థలో 3035 ఉద్యోగాల భర్తీకి సంబంధించి కసరత్తు జరుగుతోందని వెల్లడి
  • ఇంతలో నోటిఫికేషన్ విడుదలైందని, దరఖాస్తు చేసుకోవాలని ఫేక్ ప్రచారం జరుగుతోందని హెచ్చరిక
  • అలాంటి లింక్స్‌ను నమ్మవద్దు.. క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని సూచన
టీజీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, కానీ అవన్నీ ఫేక్ అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.

'ఆర్టీసీ ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక!!' అంటూ ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మేరకు సంస్థలో 3035 ఉద్యోగాల భర్తీకి సంబంధించి కసరత్తు ప్రారంభమైందన్నారు. కానీ నోటిఫికేషన్ విడుదలైందంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. ఈ ఫేక్ ప్రచారంలో ఉద్యోగార్థుల అర్హతలు, దరఖాస్తు ఫీజు, తదితర వివరాలను కూడా పేర్కొన్నారని తెలిపారు. కానీ వాటిని, అలాంటి లింక్‌లను ఉద్యోగార్థులు నమ్మవద్దని సూచించారు. క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయవద్దన్నారు.
Sajjanar
TGSRTC
Telangana

More Telugu News