Jasprit Bumrah: ప్రపంచంలో ప్రస్తుతం అత్యుత్తమ బౌలర్‌ అతడే: ఆసీస్ దిగ్గజం బ్రెట్ లీ

Brett Lee praises Indian star ace Jasprit Bumrah claiming he is the best bowler in all three formats
  • భారత స్టార్ పేసర్‌పై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం ప్రశంసల జల్లు
  • ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ అతడే అత్యుత్తమ బౌలర్ అని ప్రశంసలు
  • జస్ప్రీత్ బుమ్రా అసాధారమైన ఆటగాడని కితాబు  
భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2024ను గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం బ్రెట్ లీ ప్రశంసల జల్లుకురిపించాడు. ప్రస్తుత తరం ఫాస్ట్ బౌలర్లలో అతడే అత్యుత్తమ బౌలర్ అని మెచ్చుకున్నాడు. బుమ్రా అద్భుతమైన బౌలర్ అని, అన్ని ఫార్మాట్లలోనూ అతడే మెరుగైన బౌలర్ అని పేర్కొన్నాడు. 

బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించి ప్రత్యర్థి జట్లపై దాడి చేస్తాడని, కొత్త బంతితో అద్భుతమైన వేగాన్ని రాబట్టగలడంటూ బుమ్రాను బ్రెట్ లీ పొగిడాడు. టీ20 వరల్డ్ కప్‌లో ప్రదర్శన అతడిలోని నాయకత్వ సామర్థ్యాలను బయటపెట్టిందని అన్నాడు. అసాధారణమైన బౌలర్ అని నిస్సందేహంగా చెప్పవచ్చునని, భారత్ సాధిస్తున్న విజయాల పట్ల ప్రశంసలు అందుకునే అర్హత ఉందని వ్యాఖ్యానించాడు. కాగా టీ20 వరల్డ్ కప్‌లో బుమ్రా చాలా పొదుపుగా బౌలింగ్ చేసి ఏకంగా 15 వికెట్లు సాధించాడు. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు’ దక్కిన విషయం తెలిసిందే.

ఇక టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన జట్టు అద్భుతంగా ఉందని బ్రెట్ లీ అన్నాడు. బ్యాటింగ్‌లో పై నుంచి కింది దాకా ప్రతి స్థానంలో ఆధిపత్యం చాటగలిగే ఆటగాళ్లు ఉన్నారని, బ్యాటింగ్ ఆర్డర్‌ను గమనిస్తే ఈ విషయం అర్థమవుతోందని పేర్కొన్నాడు. మిడిల్ ఆర్డర్ చాలా బలంగా ఉందని, వేగంగా పరుగులు రాబట్టగలిగే హిట్టర్లు ఉన్నారని అన్నాడు. ఇక బౌలింగ్‌లో అయితే జస్ప్రీత్ బుమ్రా అసాధారణ ఆటగాడని కొనియాడాడు. కాగా ప్రస్తుతం జరుగుతున్న ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌’లో బ్రెట్‌ లీ ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా లెజెండ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Jasprit Bumrah
Brett Lee
T20 World Cup 2024
Cricket

More Telugu News