Nara Lokesh: పర్సనల్ మెయిల్ ఐడీని ప్రకటించిన లోకేశ్.. వినతులు ఆ మెయిల్ ఐడీకి పంపాలని విన్నపం

Nara Lokesh requests people to send their issues to his personal mail ID

  • లోకేశ్ వాట్సాప్ కు వెల్లువెత్తుతున్న వినతులు
  • టెక్నికల్ సమస్యలతో బ్లాక్ అవుతున్న లోకేశ్ వాట్సాప్
  • మెయిల్ పంపితే సమస్యలు పరిష్కరిస్తానన్న లోకేశ్

సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు [email protected] మెయిల్ ఐడీకి పంపాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్‌లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ ను 'మెటా' బ్లాక్ చేసింది. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న మంత్రి లోకేశ్ వాట్సాప్ బ్లాక్ కావడం, తరచూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతుండటంతో తన పర్సనల్ మెయిల్ ఐడీ [email protected] కి ప్రజలు తమ వినతులు, సమస్యలు పంపించాలని ఒక ప్రకటనలో కోరారు.

సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికలకు ముందే నారా లోకేశ్ ప్రకటించారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రతిరోజు ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకునే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో తన వాట్సాప్‌కి వచ్చిన మెసేజ్ కు రియాక్ట్ అయ్యి 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కరించారు. వేలాది మంది తమ సమస్యలను ఒకేసారి మంత్రి నారా లోకేశ్ కి వాట్సాప్ చెయ్యడం వల్ల టెక్నికల్ సమస్యతో బ్లాక్ అయింది. తనకు సమాచారం పంపే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తానే హ్యాండిల్ చేసే పర్సనల్ మెయిల్ ఐడీ [email protected] కి సమస్యలను పంపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

పాదయాత్రలో యువతకు తనను దగ్గరగా చేర్చిన "హలో లోకేశ్" కార్యక్రమం పేరుతోనే ఈ మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకున్న మంత్రి... తానే అందరి సమస్యలు నేరుగా అడ్రస్ చేస్తానని ప్రకటించారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని సూచించారు. మెయిల్ చేస్తే తాను స్పందిస్తానని తెలియజేశారు. వాట్సాప్ తరచూ బ్లాక్ కావడంతో ప్రజలు పంపే మెసేజ్ లు చూసే అవకాశం ఉండటం లేదని, దయచేసి అందరూ మెయిల్ ఐడీకే వినతులు పంపించాలని మంత్రి నారా లోకేశ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

  • Loading...

More Telugu News