Woman: ఈత కొడుతూ పసిఫిక్ మహాసముద్రంలోకి కొట్టుకుపోయిన మహిళా స్విమ్మర్.. రక్షించిన కోస్ట్ గార్డ్
- 37 గంటల పాటు సముద్రంలోనే ఉండిపోయిన మహిళా స్విమ్మర్
- ఆమె కోసం ఆ దేశ కోస్ట్ గార్డ్ గాలింపు
- హెలికాప్టర్ ద్వారా మహిళా స్విమ్మర్ను కాపాడిన జపాన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది
ఈతకొడుతూ ప్రమాదవశాత్తు పసిఫిక్ మహాసముద్రంలోకి కొట్టుకుపోయిన మహిళా స్విమ్మర్ 37 గంటల పాటు ఆ నీటిలోనే చిక్కుకుపోయింది. చివరికి ఆమెను కోస్ట్ గార్డ్ రక్షించింది. ఈ ఘటన జపాన్లో చోటు చేసుకుంది. ఓ మహిళా స్విమ్మర్ జపాన్లోని ఓ బీచ్ వద్ద సముద్రంలో ఈతకొడుతుండగా అనుకోకుండా లోపలి కొట్టుకుపోయింది. ఆమె కోసం ఆ దేశ కోస్ట్ గార్డ్ సిబ్బంది 37 గంటల పాటు గాలించారు. చివరికి హెలికాప్టర్ ద్వారా మహిళను కాపాడారు.
హెలికాప్టర్ ద్వారా తాడు కిందకు వేశారు. ఆమె తాడు సాయంతో పైకి రాగా... ఓ నౌకలో ఆమెను దింపారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్విమ్మింగ్ రింగ్ సాయంతో మహిళ తన ప్రాణాలను కాపాడుకున్నట్లు తెలిపారు. సముద్రంలో 80కి పైగా కిలో మీటర్ల దూరం వరకు ఆమె కొట్టుకుపోయినట్లు తెలిపారు. ఆమెను చైనా దేశస్థురాలిగా గుర్తించారు.