Telangana: తెలంగాణ డీఎస్సీ పరీక్షల హాల్ టిక్కెట్ల విడుదల

DSC hall tickets released
  • ఈ నెల 18 నుంచి ఆగస్ట్ 5 వరకు డీఎస్సీ పరీక్షలు
  • ఆన్ లైన్ విధానంలో పరీక్షల నిర్వహణ
  • అభ్యర్థులు పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ద్వారా హాల్ టిక్కెట్‌ను పొందవచ్చు
తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షల హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. డీఎస్సీ పరీక్షలు ఈ నెల 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు జరగనున్నాయి.

ఆన్ లైన్ విధానంలో ఈ పరీక్షలు వుంటాయి. డీఎస్సీ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.7 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు.

అభ్యర్థులు తమ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ లేదా ఆధార్ నెంబర్, పోస్ట్ కేటగిరి, మాధ్యమం, పుట్టిన తేదీ తదితర వివరాలను ఎంటర్ చేసి హాల్ టిక్కెట్లను పొందవచ్చు.
Telangana
DSC
Exams

More Telugu News