Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌పై కేసు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో ఏపీ సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై కేసు నమోదైంది. 2021లో నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో విద్వేషపూరిత ప్రసంగం, కొన్ని వర్గాల్లో ఉద్రిక్తత సృష్టించడం, ప్రభుత్వ ప్రముఖులపై దాడి వంటి ఆరోపణలతో రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లో సీఐడీ అదుపులోకి తీసుకుంది.
ఆ సమయంలో తనను కస్టడీకి తీసుకోవడమే కాకుండా తీవ్రంగా కొట్టారని, తనపై హత్యయత్నం కూడా జరిగిందంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు తాజాగా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.