Rajinikanth: అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో రజనీకాంత్ డ్యాన్స్... వీడియో ఇదిగో!

Rajinikanth dances in Anant Ambani wedding celebrations
  • ముంబయిలో అంబానీ తనయుడి పెళ్లి కోలాహలం
  • వివాహ వేడుకలకు హాజరైన ప్రపంచ ప్రముఖులు
  • పెళ్లికొడుకు అనంత్ తో కలిసి చిందేసిన రజనీ   
రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాధినేత, భారతీయ సంపన్నుడు ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుకకు ప్రపంచ ప్రముఖులు హాజరయ్యారు. 

ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన అనంత్ అంబానీ వివాహ సంబరాల్లో అమెరికా ప్రభుత్వ మాజీ పెద్దలు, సినీ తారలు, క్రీడాకారులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు పాలుపంచుకున్నారు. 

కాగా, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. పెళ్లికొడుకు అనంత్ తో కలిసి రజనీ చిందేశారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా రజనీతో కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. 

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పరిణయ మహోత్సవ వేడుకలకు ప్రొఫెషనల్ రెజ్లర్ జాన్ సీనా, నిక్ జొనాస్-ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్, గౌరి ఖాన్, సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అర్పిత్ ఖాన్, విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు, నమ్రత, సితార, క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నిధి అగర్వాల్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్, వికీ కౌశల్, ధోనీ, సాక్షి, జివా, జాకీ ష్రాఫ్, కేఎల్ రాహుల్, అతియా శెట్టి, సునీల్ శెట్టి, అహాన్ శెట్టి తదితరులు హాజరయ్యారు.
Rajinikanth
Anant Ambani
Wedding
Dance
Mumbai

More Telugu News