Nandyala: నిద్రమత్తులో రైల్లోంచి జారిపడ్డ భార్య.. కాపాడబోయిన భర్త దుర్మరణం!

Man dead in Nandial after trying to save wife who fell from moving train
  • నంద్యాల జిల్లా ఎర్రగుంట్ల వద్ద ప్రమాదం
  • ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీ ఫుట్‌బోర్డుపై దంపతుల ప్రయాణం
  • నిద్రమత్తులో రైలు నుంచి జారిపడ్డ భార్య, 
  • మహిళను కాపాడేందుకు కిందకు దూకి భర్త దుర్మరణం
  • తీవ్రగాయాలపాలైన బాధితురాలికి ఆసుపత్రిలో చికిత్స
రైలు నుంచి జారిపడ్డ తన భార్యను కాపాడబోయిన ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య ఆసియాబాను ఫుట్‌బోర్డుపై కూర్చుని ప్రయాణించారు. రైలు ఎర్రగుంట్ల మీదుగా వెళుతున్న సమయంలో నిద్రమత్తులో ఉన్న ఆసియాబాను రైలు నుంచి జారి కిందపడింది. ఇది గమనించిన వెంటనే భార్యను కాపాడేందుకు రైలు నుంచి దూకిన ఆసిఫ్ మృతిచెందాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మహిళను చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులను కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా చిరూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. నాలుగు నెలల క్రితమే ఆ జంట ప్రేమ వివాహం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గుంటూరు నుంచి బెంగళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
Nandyala
Train Accident

More Telugu News