Seethakka: వృద్ధురాలి ఆసరా పెన్షన్ రికవరీ నోటీసులు... మంత్రి సీతక్క వివరణ
- మల్లమ్మకు డబుల్ పెన్షన్ వస్తోందన్న సీతక్క
- ఒకే వ్యక్తికి రెండు పెన్షన్లు నిబంధనలకు విరుద్ధమని వెల్లడి
- మొత్తం 1,862 మందికి డబుల్ పెన్షన్ వస్తున్నట్లు వెల్లడి
- వారందరికీ ట్రెజరీ శాఖ నోటీసులు ఇచ్చిందన్న సీతక్క
ఆసరా పెన్షన్‌ను తిరిగి చెల్లించాలంటూ కొత్తగూడెం జిల్లాకు చెందిన దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి అధికారులు నోటీసులు ఇవ్వడంపై మంత్రి సీతక్క స్పందించారు. పెన్షన్ డబ్బులపై వృద్ధురాలికి రికవరీ నోటీసులు రావడంపై విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై సీతక్క స్పందిస్తూ... ఇప్పటికే మల్లమ్మ నెలకు రూ.24,073 కుటుంబ పెన్షన్ పొందుతున్నట్లు చెప్పారు.
మరోపక్క, మల్లమ్మ కూతురు ఏఎన్ఎంగా పని చేస్తూ మృతి చెందడంతో కుటుంబ పెన్షన్ మరొకటి కూడా వస్తోందన్నారు. మరోవైపు, మల్లమ్మ కొడుకు ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అని, మరొకరు ప్రైవేటు ఉద్యోగి అని తెలిపారు. అయితే ఇక్కడ ఒకే వ్యక్తి రెండు పెన్షన్లు పొందడం అన్నది నిబంధనలకు విరుద్ధమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,862 మందికి డబుల్ పెన్షన్లు వస్తున్నాయని, వీరికి ట్రెజరీ శాఖ నోటీసులు ఇచ్చిందన్నారు. వీరు ప్రభుత్వ కుటుంబ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారన్నారు.