Donald Trump: మా నాన్న కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు: ఇవాంకా ట్రంప్

Ivanka Trump thanked every one who prays for her father Donald Trump
  • ఎన్నికల ప్రచారం చేస్తున్న ట్రంప్ పై కాల్పులు
  • ట్రంప్ కు చెవి పక్కన తీవ్ర గాయం
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జి!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై పెన్సిల్వేనియాలోని బట్లర్ కౌంటీలో కాల్పులు జరగడం తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవి పక్కన తీవ్ర గాయమైంది. చికిత్స అనంతరం ట్రంప్ డిశ్చార్జి అయినట్టు తెలుస్తోంది. దీనిపై ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ స్పందించారు. 

"ఇవాళ బట్లర్ కౌంటీలో జరిగిన విచక్షణ రహితమైన హింసలో గాయపడిన మా నాన్న కోసం, ఇతర బాధితుల కోసం ప్రార్థించిన వారికి, ప్రేమాభిమానాలు చూపించిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ ఎంతో వేగంగా స్పందించి, సరైన నిర్ణయాలు తీసుకున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు, ఇతర భద్రతా అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కష్ట సమయంలో దేశం కోసం ప్రార్థనలు కొనసాగిస్తాను. ఇప్పుడే కాదు ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నాన్నా" అంటూ ఇవాంకా ట్రంప్ ట్వీట్ చేశారు.
Donald Trump
Firing
Ivanka Trump
US Presidential Polls
USA

More Telugu News