Taapsee: అనంత్ అంబానీ వివాహానికి వెళ్లకపోవడానికి కారణం ఇదే: తాప్సీ

Taapsee explains why she was not attended Ambani marriage
  • అనంత్ అంబానీ వివాహానికి దూరంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులు
  • అంబానీ కుటుంబంతో తనకు పరిచయం లేదన్న తాప్సీ
  • పరిచయం ఉంటేనే ఎవరి పెళ్లికైనా వెళ్తానని వివరణ
ప్రముఖ వ్యాపారవేత్త, మన దేశ శ్రీమంతుడు ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ల వివాహం ఈ నెల 12న ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి దేశ, విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు హాజారయ్యారు. హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు వివిధ సినీ రంగాలకు చెందిన స్టార్లు తరలి వచ్చారు. అయితే కొందరు సినీ తారలు మాత్రం ఈ పెళ్లికి దూరంగా ఉన్నారు. వీరిలో హీరోయిన్ తాప్సీ ఒకరు. 

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ పెళ్లికి ఎందుకు వెళ్లలేదనే ప్రశ్న తాప్సీకి ఎదురయింది. ఈ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ... అంబానీ కుటుంబంతో తనకు ఎలాంటి అనుబంధం లేదని తెలిపింది. వ్యక్తిగతంగా వారితో తనకు పరిచయం లేదని చెప్పింది. ఎవరి పెళ్లికైనా వారితో పరిచయం ఉంటేనే తాను వెళ్తానని తెలిపింది. పెళ్లి అనేది పూర్తిగా వారి వ్యక్తిగత అంశమని చెప్పింది.
Taapsee
Bollywood
Tollywood
Anant Ambani
Mukesh Ambani
Marriage

More Telugu News