Ponnam Prabhakar: అప్పుడు కేసీఆర్ చేసింది కరెక్ట్ అయితే.. ఇప్పుడు మేము చేస్తున్నది కూడా కరెక్టే: పొన్నం ప్రభాకర్

BRS MLAs are coming into Congress to protect govt says Ponnam Prabhakar
  • బీజేపీ ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందో అందరికీ తెలుసన్న పొన్నం
  • తాము ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని వ్యాఖ్య
  • ప్రభుత్వాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వస్తున్నారన్న పొన్నం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లోకి చేర్చుకుంటుండటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సెటైర్లు వేశారు. దేశంలో బీజేపీ ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందో అందరికీ తెలుసని ఆయన అన్నారు. 

మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అంటుంటే... తాము చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నామని చెప్పారు. తమకు తాముగా ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని తెలిపారు. ప్రభుత్వాన్ని కాపాడుతామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ లోకి వస్తున్నారని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆరోజు కేసీఆర్ చేసింది కరెక్ట్ అయితే... ఈరోజు మేము చేస్తున్నది కూడా కరెక్టే అని అన్నారు.
Ponnam Prabhakar
Congress
Bandi Sanjay
BJP
BRS
KCR

More Telugu News