Donald Trump: ట్రంప్ పై దాడికి సంబంధించి ఆసక్తికర వీడియో పంచుకున్న రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma shares a video of assasin ready to fire on Trump
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్
  • పెన్సిల్వేనియాలో ట్రంపై హత్యాయత్నం
  • దుండగుడ్ని కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు
ఎన్నికల ప్రచారం చేస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరగడం తెలిసిందే. ట్రంప్ తలను తాకాల్సిన బుల్లెట్ చెవిని తాకుతూ వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. నిందితుడు థామస్ క్రూక్స్ ను సీక్రెట్ సర్వీస్ ఘటన జరిగిన వెంటనే మట్టుబెట్టారు. 

అయితే, ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తి గురించి కొందరు ప్రత్యక్ష సాక్షులు ముందే పోలీసులను అప్రమత్తం చేసినా, పోలీసులు సరిగా స్పందించలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక ఆసక్తికర వీడియోను ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

ఓవైపు ట్రంప్ మీటింగ్ జరుగుతుండగా... ఆగంతుకుడు ఓ బిల్డింగ్ పైన దాడికి సిద్ధమవుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆ ఆగంతుకుడ్ని సభకు వచ్చిన వారిలో కొందరు చూశారు. దీనిపై వర్మ స్పందిస్తూ... డొనాల్డ్ ట్రంప్ ను చంపడానికి వచ్చిన ఆ దుండగుడ్ని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తప్ప ప్రతి ఒక్కరూ చూశారని ట్వీట్ చేశారు.
Donald Trump
Firing
Ram Gopal Varma
Video
Pennsylvania
US Presidential Polls
USA

More Telugu News