Crime News: చేబ్రోలులో 8వ తరగతి బాలిక అనుమానాస్పద మృతి.. పరారీలో గ్యాస్ డెలివరీ బాయ్

8th class girl Suspicious in Guntur District Chebrolu
  • చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలెంలో ఘటన
  • ఒంట్లో బాగాలేదని మధ్యాహ్నమే స్కూలు నుంచి వెళ్లిపోయిన బాలిక
  • సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో ఊరంతా గాలింపు
  • చివరికి గ్యాస్ డెలివరీబాయ్ ఇంట్లో బాలిక మృతదేహం గుర్తింపు
  • ఘటన తర్వాత పరారీలో నాగరాజు
గుంటూరు జిల్లా చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలేనికి చెందిన బాలిక అదే గ్రామంలోని ఓ గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. 13 ఏళ్ల శైలజ గ్రామంలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అన్నయ్యతో కలిసి నిన్న పాఠశాలకు వెళ్లిన శైలజ స్కూలు వదిలాక మాత్రం రాలేదు. ఉపాధ్యాయులను ఆరా తీస్తే ఒంట్లో బాగా లేదని మధ్యాహ్నమే వెళ్లిపోయినట్టు చెప్పారు. దీంతో అందరూ కలిసి గ్రామంలో గాలించారు.

ఈ క్రమంలో గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంటి వద్ద చెల్లెలి మృతదేహం ఉండడాన్ని బాలిక అన్న గుర్తించి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఆ ఇంటి తాళం పగలగొట్టి కుమార్తెను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమె మెడపై గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా, వివాహితుడైన నాగరాజు మూడేళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఘటన తర్వాత పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Crime News
Andhra Pradesh
Guntur District
Chebrolu

More Telugu News