Heavy Rains: ఏపీలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు... లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఏపీఎస్డీఎంఏ
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- రేపు ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు
- ఈ నెల 18, 19 తేదీల్లో రెండు, మూడు చోట్ల అతి భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఈ నెల 18, 19 తేదీల్లో రాష్ట్రంలో రెండు మూడు చోట్ల అతి భారీ వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది.
రేపు (జులై 17) అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని వివరించారు.