Mumbai: జలపాతం వద్ద చార్టెడ్ అకౌంటెంట్ రీల్స్.. లోయలో పడి దుర్మరణం

Mumbai based reel star Anvi Kamdar dies after falling into gorge while making video
జలపాతం వద్ద రీల్స్ చేస్తూ ఓ మహిళా చార్టెడ్ అకౌంటెంట్ పక్కనే ఉన్న లోయలో పడి మృతి చెందిన ఘటన తాజాగా వెలుగు చూసింది. అన్వీ కామ్దార్ ముంబైలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఇటీవల ఆమె రాయ్‌గఢ్‌లోని ప్రఖ్యాత కుంభే జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ రీల్స్ వీడియో రికార్డు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కాలు జారి 300 అడుగులు లోతున్న లోయలో పడి మృతి చెందారు. స్నేహితులతో కలిసి అక్కడికి షికారుకు వచ్చిన సందర్భంగా ఈ దుర్ఘటన జరిగింది. 

స్నేహితుల ద్వారా సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను మన్‌గావ్‌లోని తాలూకా ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు పోలీసులు తెలిపారు. ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండే కామ్‌దార్, నిత్యం షార్ట్ వీడియోలు పోస్టు చేసేవారు.
Mumbai
Maharashtra
Crime News
Instagram

More Telugu News