Mithun Reddy: ఇలాంటి దాడులు ఎన్నడూ చూడలేదు: మిథున్ రెడ్డి

Mithun Reddy comments on attacks on YSRCP workers
  • వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయన్న మిథున్ రెడ్డి
  • తమ ప్రభుత్వంలో ఇలాంటి దాడులు చూడలేదని వ్యాఖ్య
  • పోలీసులు పట్టించుకోకపోతే ప్రైవేట్ కేసులు వేస్తామని హెచ్చరిక
కేసులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడొద్దని, ధైర్యంగా ఉండాలని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని... మన ప్రభుత్వంలో ఇలాంటి దాడులను ఎన్నడూ చూడలేదని చెప్పారు. తనపై కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని తెలిపారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు ఇలాగే కొనసాగితే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. పోలీసులు పట్టించుకోకపోతే కోర్టుల్లో ప్రైవేట్ కేసులు వేస్తామని హెచ్చరించారు. పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకే తాను వచ్చానని అన్నారు. సదుం మండలంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Mithun Reddy
YSRCP

More Telugu News