RBI: 10 బ్యాంకులపై మైక్రోసాఫ్ట్ విండోస్ ప్రభావం: ప్రకటించిన ఆర్బీఐ
- ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆర్బీఐ
- ఇది కేవలం స్వల్ప అంతరాయమేనని వెల్లడి
- వాటిలో కొన్ని ఇప్పటికే పరిష్కరించినట్లు తెలిపిన ఆర్బీఐ
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా మన దేశంలో 10 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై స్వల్ప ప్రభావం పడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఇది కేవలం స్వల్ప అంతరాయమేనని తెలిపింది. వాటిలో కొన్నిటిని ఇప్పటికే పరిష్కరించినట్లు వెల్లడించింది.
చాలా బ్యాంకుల కీలక వ్యవస్థలు క్లౌడ్‌లో లేవని ఆర్బీఐ పేర్కొంది. కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ సేవలను వినియోగిస్తున్నట్లు తెలిపింది. విండోస్ అంతరాయం కారణంగా మన దేశంలో బ్యాంకింగ్ సేవల్లో, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.