Daggubati Purandeswari: జగన్ ఇప్పుడు ప్రధానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉంది: పురందేశ్వరి

Purandeswari ridicules Jagan letter to PM Modi
  • ప్రధాని మోదీకి లేఖ రాసిన జగన్
  • ఏపీలో రెడ్ బుక్ ఆధారంగా పాలన సాగుతోందని వెల్లడి
  • కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి
  • వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దారుణాలపై జగన్ ఎప్పుడూ స్పందించలేదన్న పురందేశ్వరి
ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందంటూ వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం తెలిసిందే. గత 45 రోజులుగా ఏపీలో రెడ్ బుక్ ఆధారంగా పాలన సాగుతోందని, ఏపీలో ఎన్నికల తర్వాత ఘటనలపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని జగన్ తన లేఖలో కోరారు. 

దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన దారుణాలపై జగన్ ఎప్పుడూ స్పందించలేదని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులపై ప్రధానికి జగన్ లేఖ రాయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో జగన్ ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని పురందేశ్వరి అన్నారు.
Daggubati Purandeswari
Jagan
Letter
Narendra Modi
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News