Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ భేటీ ప్రారంభం
- జులై 22 నుంచి పార్లమెంటు సమావేశాలు
- ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం
- పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు నిర్దేశం
- ఏపీకి రావాల్సిన నిధులు, పథకాలపై చర్చ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాగా, లోక్ సభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి కిందట ఈ సమావేశం ప్రారంభమైంది.
ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా హాజరయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీకి కేంద్రంలోని వివిధ శాఖల నుంచి రావాల్సిన నిధులు, రావాల్సిన పథకాలపై టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ 16 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం తెలిసిందే. ఎన్డీయే కూటమికి కేంద్రంలో మ్యాజిక్ ఫిగర్ రావడంలో టీడీపీ సంఖ్యా బలం తోడ్పడింది.