Dorling Prabhas: మోస్ట్ పాప్యులర్ హీరోగా డార్లింగ్ ప్రభాస్

Prabhas Stands Top In Armox Media Most Popular Actors List For the Month Of June
  • జాబితా విడుదల చేసిన ఆర్మాక్స్ మీడియా
  • రెండో స్థానంలో బాలీవుడ్ బాద్ షా
  • నాలుగు, ఐదో స్థానాల్లో అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్
దేశంలోనే మోస్ట్ పాప్యులర్ హీరోగా డార్లింగ్ ప్రభాస్ నిలిచారని ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ పేర్కొంది. ఈమేరకు మోస్ట్ పాప్యులర్ జాబితాను విడుదల చేసింది. కల్కి సినిమా సంచలన విజయంతో ప్రభాస్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టారని తెలిపింది. ఆయన తర్వాతి స్థానంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఉన్నట్లు వెల్లడించింది. కాగా, మే నెలలో విడుదల చేసిన జాబితాలోనూ ప్రభాస్ అగ్రస్థానంలో ఉన్నారు.

జూన్ నెలకు సంబంధించిన జాబితాను తాజాగా విడుదల చేయగా.. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాలుగో స్థానంలో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఐదో స్థానంలో ఉన్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’తో త్వరలో థియేటర్లలో సందడి చేయనున్న రామ్‌ చరణ్‌ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. ఇక హీరోయిన్ ల విషయానికి వస్తే ఆలియా భట్ మొదటి స్థానంలో, సమంత, దీపిక పడుకొణే రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
Dorling Prabhas
Most Popular Hero
Armox Media
Allu Arjun
Jr NTR
Ramcharan

More Telugu News