Nagarjuna Yadav: డీజీపీ గారూ... గత ప్రభుత్వ హయాంకి, ఇప్పటికి చట్టాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా?: వర్ల రామయ్య

Varla Ramaiah asked the DGP if there were any changes in the laws
  • సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నాగార్జున యాదవ్
  • అదుపులోకి తీసుకుని 41ఏ కింద నోటీసులు ఇచ్చి వదిలిపెట్టిన పోలీసులు
  • నాగార్జున యాదవ్ ను పోలీసులు వదిలేశారన్న వార్తలపై తీవ్రంగా స్పందించిన వర్ల రామయ్య
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అయితే, ఆయనను పలు అంశాలపై ప్రశ్నించి, 41ఏ కింద నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్రంగా స్పందించారు. 

డీజీపీ గారూ... గత ప్రభుత్వ హయాంకి, ఇప్పటికి చట్టాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఇప్పుడు నాగార్జున యాదవ్ చేసిన తప్పులు గతంలో మా పార్టీ వారు చేస్తే విరగ్గొట్టి అరెస్ట్ చేసే వాళ్లు... మరి అంతకంటే ఘోరంగా వ్యవహరించిన వైసీపీ యాదవ్ గారిని పోలీసులు విచారణ చేసి వదిలేశారట... ఓసారి కనుక్కోగలరా? అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు. 
Nagarjuna Yadav
Varla Ramaiah
DGP
TDP
YSRCP

More Telugu News