Akshilesh Yadav: ఢిల్లీలో అఖిలేశ్ యాదవ్ కారును అడ్డుకున్న మాజీ జడ్జి రామకృష్ణ

Former judge Ramakrishna explains cases on Jagan and Vijayasai to Akhilesh Yadav
  • ఏపీలో ప్రజాస్వామ్యం మంటగలుస్తోందన్న వైసీపీ
  • హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ జగన్ ఆగ్రహం
  • నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ నిరసన ప్రదర్శన
  • జగన్ కు మద్దతు ప్రకటించిన అఖిలేశ్ యాదవ్
గతంలో తనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందంటూ హైకోర్టును ఆశ్రయించిన మాజీ జడ్జి రామకృష్ణ తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు. ఇవాళ ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మద్దతు పలికారు. అయితే, వైసీపీ నిరసన ప్రదర్శనలో పాల్గొని, తిరిగి వస్తున్న అఖిలేశ్ యాదవ్ ను మాజీ జడ్జి రామకృష్ణ అడ్డుకున్నారు. 

అఖిలేశ్ వాహనాన్ని ఆపిన రామకృష్ణ... ఆయనకు జగన్, విజయసాయిపై ఉన్న కేసుల వివరాలను వినిపించారు. ఇలాంటి వ్యక్తులు తెలిపే నిరసనలకు మద్దతు ఇవ్వడం సబబు కాదని అన్నారు. గత ఐదేళ్లు ఏపీలో జగన్ విధ్వంసానికి పాల్పడ్డారని అఖిలేశ్ యాదవ్ కు వివరించారు. ఈ మేరకు ఓ వీడియోను టీడీపీ సోషల్ మీడియాలో పంచుకుంది.
Akshilesh Yadav
Ramakrishna
Jagan
Vijay Sai Reddy
YSRCP
New Delhi

More Telugu News