Nepal Plance Crash: నేపాల్ విమాన ప్రమాదంలో పైలట్ మినహా అందరూ దుర్మరణం.. వీడియో ఇదిగో
- ఖాట్మండు విమానాశ్రయంలో నిన్న ప్రమాదం
- శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అదుపుతప్పి కూలిన వైనం
- ప్రమాద సమయంలో విమానంలో 17 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది
నేపాల్‌లోని ఖాట్మండు విమానాశ్రయంలో బుధవారం ఘోర విమాన ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో 17 మంది ప్రయాణికులు ఇద్దరు సిబ్బంది ఉన్నారు. విమానం కూలగానే ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో చిక్కుకుని పైలట్ మినహా అందరూ దుర్మరణం చెందారు. పోఖరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ విమానం టూరిస్టులకు సేవలు అందించే శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందినది అని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, విమానం కూలేందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే విమానం రన్‌వేను ఢీకొట్టి సమీపంలో కూలిపోయింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మరాయి.
ఇటీవల కాలంలో నేపాల్‌లో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సిబ్బందికి శిక్షణ, నిర్వహణ లోపాలు సమస్యలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఐరోపా సమాఖ్య నేపాల్ విమానాలు తమ గగనతలంలోకి రాకుండా నిషేధం విధించింది. ఇక అత్యంత ఎత్తున, చుట్టూరా కొండల మధ్య ఉండే నేపాల్ విమానాశ్రయాలు, అక్కడి వాతావరణ పరిస్థితులు విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో సమస్యలు సృష్టిస్తుంటాయి.