Paris Olympics 2024: అదరహో ధీరజ్... పారిస్ ఒలింపిక్స్ లో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత పురుషుల ఆర్చరీ టీమ్

Indian mens archery team secured a direct qualification to the quarter final round at the Paris Olympics 2024
భారత పురుషుల ఆర్చరీ జట్టు అదరగొట్టింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో నేరుగా క్వార్టర్-ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించింది. ప్యారిస్‌లోని ఎప్లానేడ్ డెస్ ఇన్వాలిడ్స్‌లో జరిగిన ర్యాంకింగ్ రౌండ్‌లో భారత ఆర్చర్లు ఆరంభంలో తడబాటుకు గురైనప్పటికీ... పుంజుకొని చివరకు టాప్-4లో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు.

ఆర్చర్లు బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌ అదరగొట్టారు. మొత్తం 2013 పాయింట్లు సంపాదించారు. 681 పాయింట్లు సంపాదించిన ధీరజ్ భారత జట్టుని టాప్-4లో నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అత్యుత్తమంగా రాణించి వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో నాలుగవ స్థానంలో నిలిచాడు.

కాగా భారత్ జట్టు మూడవ స్థానంలో నిలవడంతో క్వార్టర్ ఫైనల్ రౌండ్‌లో టర్కీ లేదా కొలంబియాతో భారత జట్టు తలపడనుంది. భారత జట్టు సెమీ ఫైనల్‌ కు చేరుకొని అక్కడ దక్షిణ కొరియా జట్టు ఎదురుకాకుంటే టాప్-2లో నిలిచే అవకాశాలు ఉన్నాయి.
Paris Olympics 2024
Bommadevara Dhiraj
India
Olympics

More Telugu News