Samit Dravid: టీ20 టోర్నీ వేలంలో రాహుల్ ద్రావిడ్ కుమారుడిని దక్కించుకున్న మైసూరు వారియర్స్!

Rahul Dravids Son All Set To Play In T20 League Bought In Auction For
  • మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న సమిత్ ద్రావిడ్ 
  • రూ.50 వేలకు సమిత్‌ను దక్కించుకున్న మైసూరు వారియర్స్ 
  • సమిత్ గత మ్యాచుల్లో తన ప్రతిభ చాటుకున్నాడన్న టీం
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్ ఓ టీ20 టోర్నీలో ఆడనున్నాడు. మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీ వేలంలో మైసూరు వారియర్స్ టీం అతడిని రూ.50 వేలకు దక్కించుకుంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సీమర్ అయిన సమిత్ మంచి ప్రతిభ కనబరిచాడని ఈ సందర్భంగా మైసూరు వారియర్స్ తెలిపింది. వివిధ ఏజ్ గ్రూపుల టోర్నమెంట్లలో అతడు ఇప్పటికే సత్తా చాటాడని తెలిపింది. ఈ సీజన్‌లో కూచ్ బేహార్ ట్రోఫీ గెలిచిన అండర్-19 జట్టులో సమిత్ ఉన్నాడు. కేఎస్‌సీఏ 11 తరపున కూడా ఆడాడు. 

ఇక గత సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన మైసూరు వారియర్స్‌ ఈసారి కూడా కరుణ్ నాయర్ నేతృత్వంలో బరిలో దిగింది. ఇటీవలి వేలంలో రూ.1 లక్షకు పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను దక్కించుకుంది. అతడి చేరికతో టీం బౌలింగ్ లైనప్ మరింత పటిష్ఠంగా మారిందని జట్టు భావిస్తోంది. ఈ టోర్నీ కోసం నాయర్‌ను వారియర్స్ జట్టు రిటైన్ చేసుకుంది. ఇటీవలే కాలి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న ప్రసిద్ధ్ ఈ టోర్నీలో తన సత్తా చాటేందుకు ఉత్సుకతతో ఉన్నాడు. 

మైసూరు వారియర్స్ జట్టు: కరుణ్ నాయర్, కార్తిక్ సీఏ, మనోజ్ భందగే, కార్తిక్ ఎస్.యు, సుచిత్ జే, గౌతం కే, విద్యాధర్ పాటిల్, వెంకటేశ్ ఎమ్, హర్షిల్ ధర్మానీ, గౌతమ్ మిశ్రా, ధనుశ్ గౌడ, సమిత్ ద్రావిడ్, దీపక్ దేవడిగ, సుమిత్ కుమార్, స్మయన్ శ్రీవాత్సవ, జాస్పర్ ఈజే, ప్రసిద్ధ్ కృష్ణ, ముహమ్మద్ సర్ఫరాజ్ అష్రాఫ్
Samit Dravid
Rahul Dravid
Maharaja Trophy KSCA T20
Mysore Warriors

More Telugu News