SearchGPT: సెర్చ్ జీపీటీ... గూగుల్ కు పోటీగా కొత్త సెర్చ్ ఇంజిన్ వస్తోంది!

OpenAI introduces brand new seacrh engine SearchGPT powered with AI
  • చాట్ జీపీటీతో సంచలనం సృష్టించిన ఓపెన్ ఏఐ
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో టెక్ విప్లవం
  • ఇప్పుడు సెర్చ్ జీపీటీతో గూగుల్ ఆధిపత్యానికి సవాల్
చాట్ బాట్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించి విప్లవాత్మక రీతిలో చాట్ జీపీటీ రూపొందించిన టెక్ సంస్థ ఓపెన్ ఏఐ ఇప్పుడు సరికొత్త సెర్చ్ ఇంజిన్ ను తీసుకువస్తోంది. దీనిపేరు సెర్చ్ జీపీటీ. సెర్చ్ ఇంజిన్ రంగంలో తిరుగులేని స్థానాన్ని ఆక్రమించిన గూగుల్ ను సవాల్ చేస్తూ ఓపెన్ ఏఐ ఈ నూతన సెర్చ్ ఇంజిన్ ను ప్రకటించింది. 

ప్రస్తుతానికి సెర్చ్ జీపీటీ అభివృద్ధి దశలో ఉంది. పరిమితస్థాయిలో యూజర్లతోనూ, పబ్లిషర్లతోనూ దీనిని పరీక్షిస్తున్నారు. సెర్చ్ జీపీటీ సాయంతో రియల్ టైమ్ డేటా యూజర్ల ముందు ప్రత్యక్షమవుతుందని ఓపెన్ ఏఐ చెబుతోంది. 

సెర్చ్ జీపీటీలో ఏదైనా అంశం గురించి టైప్ చేస్తే... దానికి సంబంధించిన సమాచారంతో పాటు ఆ కంటెంట్ మూలాధారమైన వనరుల లింక్ లు కూడా స్క్రీన్ పై దర్శనమిస్తాయి. యూజర్ల నుంచి వచ్చే అనుబంధ ప్రశ్నలకు కూడా సెర్చ్ జీపీటీ సమాధానమిస్తుంది.
SearchGPT
Search Engine
OpenAI
Google
Tech

More Telugu News