Hezbollah: ఫుట్‌బాల్ స్టేడియంపైకి హెజ్బొల్లా రాకెట్ దాడి.. 12 మంది చిన్నారుల మృతి.. వీడియో ఇదిగో!

12 killed in Hezbollah rocket attack in Israel
  • ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం
  • హమాస్‌కు మద్దతుగా బరిలోకి హెజ్బొల్లా 
  • మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరిక
  • తమకు సంబంధం లేదన్నహెజ్బొల్లా
ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లోని ఓ ఫుట్‌బాల్ గ్రౌండ్‌పై జరిగిన రాకెట్ దాడిలో చిన్నారులు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా పనేనని ఇజ్రాయెల్ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను హెజ్బొల్లా కొట్టిపారేసింది. హమాస్‌పై దాడి తర్వాత ఇరాన్ మద్దతు కలిగిన లెబనీస్ గ్రూప్ అయిన హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై తరచూ దాడులకు దిగుతోంది. తాజా దాడితో ఇజ్రాయెల్, గాజా మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ప్రస్తుతం రాకెట్ దాడి జరిగిన ప్రాంతం సిరియాలో ఉండేది. 1967లో దీనిని ఇజ్రాయెల్ ఆక్రమించింది. తాజా దాడిపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. హెజ్బొల్లా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. దీనిపై స్పందించిన హెజ్బొల్లా ఆ దాడితో తమకు ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొంది. ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండిస్తున్నట్టు తెలిపింది.
Hezbollah
Israel
Gaza
Israel Gaza War

More Telugu News