PV Sindhu: ఒలింపిక్స్​ తొలి రౌండ్​ లో పీవీ సింధు విజయం

pv sindhu won 1st match in paris olympics
  • తొలి మ్యాచ్ లో గెలుపుతో శుభారంభం
  • మాల్దీవులకు చెందిన క్రీడాకారిణిపై అలవోక విజయం
  • వరుసగా రెండు సెట్లలో 21-9, 21-6 తేడాతో గెలుపు
ఫ్రాన్స్ లోని పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత స్టార్ షట్లర్, మన తెలుగు అమ్మాయి పీవీ సింధు శుభారంభం చేసింది. ఒలింపిక్స్ పతకం వేటను తొలి మ్యాచ్ లోనే విజయంతో మొదలుపెట్టింది. ఒలింపిక్స్ తొలి మ్యాచ్ లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్‌ పై గెలుపొందింది. ఈ గేమ్ లో రజాక్‌  ఏ మాత్రం కూడా సింధుకు పోటీ ఇవ్వలేకపోయింది. సింధు 29 నిమిషాల్లోనే వరుసగా రెండు గేమ్ లలో మాల్దీవ్స్ క్రీడాకారిణిని చిత్తు చేసింది. రెండు సెట్లలో 21-9, 21-6 తేడాతో సింధు విజయం సాధించింది.

మరోవైపు పలు ఇతర క్రీడాంశాల్లోనూ భారత ఆటగాళ్లు తొలి రౌండ్లలో విజయం సాధించారు.
PV Sindhu
Paris Olympics
indian team

More Telugu News