Dola Balaveeranjaneya Swamy: ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామికి తప్పిన ప్రమాదం

AP Minister Balaveerajaneya Swamy escapes danger

  • ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో పోలేరమ్మ జాతర
  • బెదిరిన ఎద్దులు ఢీకొనడంతో కిందపడిపోయిన మంత్రి
  • స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో మంత్రికి తప్పిన ప్రమాదం 

ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంత్రి బాలవీరాంజనేయస్వామి ఇవాళ ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో పోలేరమ్మ జాతరకు విచ్చేశారు. మంత్రి ఓ ఎడ్లబండి వద్ద ఉండగా, బెదిరిపోయిన ఎద్దులు మంత్రిని ఢీకొన్నాయి. దాంతో ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News