Prashant Kishor: రాజకీయ పార్టీ స్థాపిస్తున్నా: ప్రశాంత్ కిశోర్ ప్రకటన

Prashant Kishor set to start political party
ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయ పార్టీ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీహార్ లో రెండేళ్ల కిందట ప్రశాంత్ కిశోర్ 'జన్ సురాజ్' పేరిట పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పుడా పాదయాత్రనే రాజకీయ పార్టీగా మార్చుతున్నట్టు ప్రశాంత్ కిశోర్ ఇవాళ వెల్లడించారు. 

తాను ప్రారంభించబోయే కొత్త పార్టీని అక్టోబరు 2 గాంధీ జయంతి నాడు ప్రకటిస్తానని తెలిపారు. అంతేకాదు, వచ్చే ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని చెప్పారు. పార్టీ నాయకత్వం, పార్టీ కార్యవర్గం వంటి వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. 

ప్రశాంత్ కిశోర్ గతంలో రాజకీయ వ్యూహకర్తగా పలు పార్టీల విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి జేడీయూ పార్టీలో చేరారు. జేడీయూ జాతీయ ఉపాధ్యక్ష పదవిని కూడా చేపట్టిన ఆయన... ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అప్పటినుంచి జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై వీలు చిక్కినప్పుడల్లా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
Prashant Kishor
Political Party
Jan Suraj
Bihar

More Telugu News