Vegan: పూర్తి శాకాహారులుగా 8 వారాలున్నా జీవసంబంధ వయసు తగ్గుముఖం!

Eating a vegan diet for short period can help reduce biological age

  • తాజా అధ్యయనంలో వెల్లడి
  • శాకాహారంతో గుండెపోటు, కాలేయం, మెటబాలిక్ వయసుల్లో తగ్గుదల
  • మాంసాహారులతో పోలిస్తే సగటున రెండు కిలోల క్యాలరీ కంటెంట్ తగ్గుదల

మాంసాహారంతో పోలిస్తే శాకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. అయితే, పూర్తిగా కాకున్నా స్వల్పకాలంపాటు వేగాన్ ( జంతు ఉత్పత్తులైన పాలు సహా తీసుకోని శాకాహారి)గా ఉన్నా బోల్డన్ని ప్రయోజనాలు ఉంటాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఈ పరిశోధన ఫలితాలు బీఎంసీ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైంది.

బయోలాజికల్ ఏజ్‌ను తెలుసుకోవడం ద్వారా మధుమేహం, చిత్త వైకల్యం (డిమెన్షియా)ను అర్థం చేసుకోవచ్చు. వయసు తగ్గింపు అనేది డీఎన్ఏ మిథిలేషన్ స్థాయులపై ఆధారపడి ఉంటుంది. ఇది డీఎన్ఏకు సంబంధించిన రసాయన మోడిఫికేషన్. దీనిని ఎపిజెనెటిక్ మోడిఫికేషన్ అని పిలుస్తారు. ఇది జన్యు వ్యక్తీకరణను మారుస్తుంది కానీ డీఎన్ఏను కాదు. 

21 మంది కవలలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో వేగాన్ డైట్ వల్ల కలిగే మాలిక్యులర్ (పరమాణు) ప్రభావాలను పరిశోధించారు. అధ్యయనంలో పాల్గొన్న జంటల్లో సగం మందిని 8 వారాలపాటు అన్ని రకాల ఆహార పదార్థాలు (శాకాహారం, మాంసాహారం) తినమన్నారు. అందులో భాగంగా వారికి 170 నుంచి 225 గ్రాముల మాంసం, గుడ్డు, డెయిరీ ఉత్పత్తులు అందించారు. మిగిలిన సగం మందికి శాకాహారం అందించారు. 

శాకాహారం తీసుకున్న వారిలో జీవసంబంధ వయసు (బయోలాజికల్ ఏజ్) తగ్గినట్టు గుర్తించారు. అదే సమయంలో అన్ని రకాల ఆహార పదార్థాలు (ఒమినివోరస్) తీసుకున్న వారిలో బయోలాజికల్ ఏజ్ తగ్గిన ఛాయలు కనిపించలేదు. పూర్తి శాకాహారం తీసుకున్న వారిలో వృద్ధాప్య ఛాయలు తగ్గడంతోపాటు గుండె, హార్మోన్, కాలయం, ఇన్‌ఫ్లమేటరీ, మెటబాలిక్ వ్యవస్థల వయసులలోనూ తగ్గుదల కనిపిస్తుందని అధ్యయనంలో తేలింది. అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకునే వారితో పోలిస్తే సగటున వీరు రెండు కిలోల క్యాలరీ కంటెంట్ కోల్పోయినట్టు పరిశోధకులు తెలిపారు.

  • Loading...

More Telugu News