India: లెబనాన్‌లోని భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ
- ఇజ్రాయెల్-లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూప్ మధ్య యుద్ధ వాతావరణం
- హిజ్బుల్లాపై ఏ క్షణమైనా ఇజ్రాయెల్ దాడి చేయవచ్చునని వార్తలు
- ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం అడ్వైజరీ
ఇజ్రాయెల్-లెబనాన్‌లోని హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. హిజ్బుల్లాపై ఏ క్షణమైనా ఇజ్రాయెల్ దాడి చేయవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లెబనాన్‌లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచన చేసింది. బీరుట్‌లోని రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించింది.
లెబనాన్‌లోని భారతీయులు లేదా లెబనాన్‌కు వెళ్లాలనుకునే భారతీయులు తప్పనిసరిగా బీరుట్‌లోని రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. లెబనాన్ కార్యాలయం ఇ-మెయిల్ ఐడి: [email protected] లేదా అత్యవసర ఫోన్ నంబర్ +96176860128 లలో సంప్రదించవచ్చునని సూచించింది.
గోలన్ హైట్స్‌లోని ఫుట్‌బాల్ మైదానంలో జరిగిన రాకెట్ దాడిలో 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇది హిజ్బుల్లా మిలిటెంట్ల పని అని ఇజ్రాయెల్ ఆరోపించింది. హిజ్బుల్లా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అయితే ఈ దాడులకు తాము కారణం కాదని హిజ్బుల్లా చెబుతోంది.