Giraffe: జిరాఫీ అంటేనే పొడుగు మెడ.. కానీ పాపం మెలితిరిగిపోయింది!
- మెడ విరగడం గానీ, ఏదైనా వ్యాధిగానీ కారణం కావొచ్చంటున్న జంతు శాస్త్రవేత్తలు
- దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్ లో కనిపించిన జిరాఫీ
- పాపం అంటూ సానుభూతి చూపుతున్న నెటిజన్లు
మామూలుగా ఎవరికైనా మెడ పొడవుగా ఉంటే.. జిరాఫీలా ఉన్నారని అంటుంటాం. మనకు తెలిసిన జీవుల్లో ఇలా విభిన్నంగా చాలా పొడవైన మెడ ఉన్న జీవులు జిరాఫీలు మాత్రమే. అలాంటి ఓ జిరాఫీకి కష్టమొచ్చింది. దాని ప్రత్యేకతకు, అది ఆహారం సులువుగా తీసుకోవడానికి వీలు కల్పించే మెడ మెలితిరిగిపోయింది.
ఫేస్ బుక్ లో పెట్టడంతో..
ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ లిన్ స్కాట్ ఫేస్ బుక్ లో ఇటీవల ఈ జిరాఫీ ఫొటోను పెట్టడంతో అది వైరల్ గా మారింది. మెడ బాగా వంగి, మెలితిరిగిపోయి ఉన్నా కూడా జిరాఫీ నిలబడే ఉంది. అయితే కాస్త మెల్లగా కదులుతోందని లిన్ స్కాట్ పేర్కొన్నారు. దీనిపై జంతు వైద్యులు, నెటిజన్ల నుంచి బాగా స్పందన వస్తోంది.
- ‘ఆ జిరాఫీ మెడ ప్రమాదం వల్లగానీ, ఏదైనా వ్యాధి వల్లగానీ మెలితిరిగిపోయి ఉంటుంది. అయితే ఎముక విరిగిందా? లేదా? అన్నది సందేహామే. ఎందుకంటే అది ఇంకా తలను నిలబెట్టే ఉంది’ అని సారా ఫెర్గ్యూసన్ అనే వెటర్నరీ వైద్యురాలు పేర్కొన్నారు.
- ఇక చాలా మంది నెటిజన్లు పాపం జిరాఫీ అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.