Kesineni Chinni: మరో కీలక ప్రశ్న అడిగి కేంద్రం నుంచి సమాధానం అందుకున్న టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని

Centre gives reply to another query from TDP MP Kesineni Chinni
టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) రాష్ట్రానికి సంబంధించిన మరో కీలక ప్రశ్న అడిగి కేంద్రం నుంచి సమాధానం అందుకున్నారు. దేశవ్యాప్తంగా క్రీడాకారులకు సంక్షేమ పథకం అమలవుతోందని, అయితే ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర ప్రభుత్వం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చింది. క్రీడాకారులకు జాతీయ సంక్షేమ నిధి అమలుకు గత ఐదేళ్లలో ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాకపోవడంతో అక్కడి క్రీడాకారులకు ఎలాంటి కేటాయింపులు జరపలేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
Kesineni Chinni
TDP MP
Mansukh Mandaviya
Lok Sabha
Andhra Pradesh

More Telugu News