American Citizenship: గ్రీన్‌కార్డు హోల్డర్లకు 3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్!
అమెరికాలో గ్రీన్‌కార్డు ఉన్న భారతీయులు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేందుకు ఇది మంచి తరుణమని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. మూడు వారాల్లో పౌరసత్వం పొందొచ్చని అన్నారు.
తాజా లెక్కల ప్రకారం, అమెరికాలో సుమారు 10 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో వృత్తినిపుణులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక గ్రీన్‌కార్డు ఉండి ఐదేళ్లుగా అమెరికాలో ఉంటున్న భారతీయులు వెంటనే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని నరసింహన్ సూచించారు. బైడెన్ ప్రభుత్వంలో పౌరసత్వం పొందడం సులువన్నారు. ఇదిలా ఉంటే నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు కీలకం కానున్నాయి. అధ్యక్ష రేసులో భారత సంతతి నేత కమలా హారిస్ ఉండటంపై భారతీయ అమెరికన్లలో ఆసక్తి నెలకొంది.