K Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు మళ్లీ నిరాశ.. రిమాండ్ పొడిగింపు!

BRS MLC K Kavitha Judicial Remand Extended For Another 14 Days
  • నేటితో ముగిసిన కవిత జ్యుడీషియల్ రిమాండ్
  • వర్చువల్‌గా కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు
  • ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం
  • కవిత రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించిన కోర్టు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోమారు నిరాశే ఎదురైంది. ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోమారు పొడిగించింది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత మార్చి 16న అరెస్టయ్యారు. అప్పటి నుంచీ ఆమె తీహార్ జైలులోనే ఉంటున్నారు. 

పలుమార్లు ఆమె పెట్టుకున్న బెయిలు దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది. నేటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుండడంతో అధికారులు ఆమెను వర్చువల్‌గా కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణ కీలక దశలో ఉందనీ, కాబట్టి కవిత రిమాండ్‌ను పొడిగించాలని ఈడీ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఆగస్టు 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
K Kavitha
Delhi Liquor Scam
Rouse Avenue Court
BRS

More Telugu News