Bhanuchandar: మా ఫాదర్ నన్నెప్పుడూ సిఫార్స్ చేయలేదు: భానుచందర్

Bhanuchandar Interview

  • యాక్షన్ హీరోగా పేరున్న భానుచందర్
  • మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణు తనయుడు ఆయన 
  • తన తండ్రికి ఎంతో పేరు ఉండేదన్న భానుచందర్ 
  • కష్టపడి అవకాశాలు అందుకున్నానని వెల్లడి


తెలుగు సినిమా యాక్షన్ కి మార్షల్ టచ్ ఇచ్చిన హీరో భానుచందర్. ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు తనయుడు ఆయన. అప్పట్లో మద్రాస్ కి కొత్తగా వెళ్లిన చాలామంది ఆర్టిస్టులు వారి ఇంట్లోనే అద్దెకి ఉండేవారు. ఒక వైపున తమిళంలోను .. మరో వైపున తెలుగులోను హీరోగా ఆయన ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 

తాజా ఇంటర్వ్యూలో భానుచందర్ మాట్లాడుతూ .. "చిన్నప్పుడు నేను చాలా అల్లరి పిల్లాడిని.  16వ ఏట నుంచి హఠాత్తుగా నాలో మార్పు వచ్చింది. తెలుగులో 'నాలాగా ఎందరో' సినిమాతో పరిచయమయ్యాను. మా నాన్నకి ఇండస్ట్రీలో చాలామంది తెలుసు. అయినా ఆయన ఎప్పుడూ ఎవరికీ నా గురించి సిఫార్స్ చేయలేదు. నేను కూడా ఆయనను ఒత్తిడి చేయలేదు" అని అన్నారు.

" నేను కూడా నా ఫొటోలు పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. బాలచందర్ గారి ఇంటికి వెళ్లేవాడిని .. గేటు దగ్గర వెయిట్ చేసేవాడిని. అప్పుడు చిరంజీవి .. సుధాకర్ .. హరిప్రసాద్ వాళ్లు కూడా ఫొటోలు పట్టుకుని వచ్చేవారు. అలా కష్టపడి అవకాశాలను సంపాదించుకున్న వాళ్లమే. నేను చేసిన 'నిరీక్షణ' అంటే నాకు చాలా ఇష్టం. తెలుగులో ఆ సినిమాను కొట్టే సినిమా ఇంతవరకూ రాలేదనే చెబుతాను" అని అన్నారు. 

  • Loading...

More Telugu News