Kodandaramireddy: అప్పట్లో బాలయ్య ఎలా ఉండేవారంటే .. :కోదండరామిరెడ్డి

Kodanda Ramireddy Interview

  • 'అనసూయమ్మగారి అల్లుడు' గురించి ప్రస్తావించిన డైరెక్టర్ 
  • ఆ కథను అన్నగారు ఓకే చేశారని వెల్లడి 
  • బాలయ్య సరదా మనిషి అంటూ వ్యాఖ్య 
  • ఆయనలో గర్వం ఉండేది కాదని వివరణ


సీనియర్ డైరెక్టర్ గా కోదండ రామిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. అప్పటి స్టార్ హీరోలందరికీ భారీ హిట్లు ఇచ్చిన దర్శకుడు ఆయన. తాజాగా 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. " రామారావుగారికి నా మీద మంచి నమ్మకం ఉండేది. ఒకసారి ఆయన బాలయ్య బాబు కోసం మంచి కథ రెడీ చేయమన్నారు.

" నేను అలాగే కథను తయారు చేసుకుని వెళ్లి ఆయనకి వినిపించాను. పది నిమిషాల్లో ఓకే చేశారు  .. ఆ సినిమానే అనసూయమ్మగారి అల్లుడు" అని అన్నారు. "బాలయ్య బాబు సెట్లో చాలా సరదాగా ఉండేవారు. నేను రామారావుగారి అబ్బాయిని .. ముఖ్యమంత్రి కొడుకుని .. గోల్డెన్ స్పూన్ తో పుట్టాను .. ఈ సినిమాకి నేను హీరోని .. మనం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి అన్నట్టుగా ఆయన అస్సలు ఉండేవారు కాదు" అని అన్నారు. 

"బాలయ్య సెట్లోని అందరికీ నమస్కారం చేస్తూనే వచ్చేవారు. సొంత సినిమా అయితే 'టీ తాగారా .. భోజనాలు చేశారా'? అని అడిగేవారు. అందరితో కలిసిపోయేవారు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన హీరో మాదిరిగా ఉండేవారు. ఎలాంటి గర్వం లేకుండా మా అందరితో కలిసి భోజనం చేసేవారు. నేను ఎప్పుడు ఎక్కడ కలిసినా మా ఇంట్లోని వాళ్లందరినీ పేరు పేరున అడుగుతారు " అని చెప్పారు.

  • Loading...

More Telugu News