Botsa: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స ఎంపిక
- ఆగస్టు 30న ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
- ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల
- వైసీపీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం బొత్స పేరు ప్రకటించిన జగన్
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎంపికయ్యారు. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం జగన్ తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స పేరును ప్రకటించారు.
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఆగస్టు 30న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో... ఆగస్టు 6న నోటిఫికేషన్, అదే రోజు నుంచి ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణ, ఆగస్టు 14న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 16 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో... విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల మున్సిపల్ కార్పొరేషన్లు, జెడ్పీ, ఎంపీపీ సభ్యులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. సెప్టెంబరు 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.