Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
- పశ్చిమాసియాలో అనిశ్చితి
- అంతర్జాతీయ పరిణామాలతో కుదుపులకు గురైన మార్కెట్లు
- నష్టాల బాటలో సెన్సెక్స్, నిఫ్టీ
గత కొన్ని రోజులుగా జీవనకాల గరిష్ఠాలను తాకుతూ దూసుకెళ్లిన భారత స్టాక్ మార్కెట్ నేడు కళ తప్పింది. స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ నేడు భారీ నష్టాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ ఏకంగా 885 పాయింట్లు నష్టపోయి 80,981 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అదే బాటలో 293 పాయింట్ల నష్టంతో 24,717 వద్ద ముగిసింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం, తద్వారా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దాంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడా కుదుపులకు గురయ్యాయి.
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలు అందించాయి. మారుతి సుజుకి, టాటా మోటార్స్, విప్రో, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూశాయి.