Jagdeep Dhankhar: రాజ్యసభలో నవ్వులు పూయించిన జ‌యా బ‌చ్చ‌న్ .. వీడియో వైర‌ల్‌!

Jagdeep Dhankhar bursts out laughing at Jaya Bachchan Amitabh mention
  • ఇటీవ‌ల త‌న‌ను భ‌ర్త పేరుతో క‌లిపి పిల‌వ‌డానికి అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన జ‌యా బ‌చ్చ‌న్‌
  • డిప్యూటీ చైర్మన్ ఆమెను 'జయా అమితాబ్ బచ్చన్' అని సంబోధించడంపై అస‌హ‌నం
  • తాజాగా ఆమె రాజ్య‌స‌భ‌లో త‌న పూర్తి పేరు చెప్పి న‌వ్వులు పూయించిన వైనం
ఇటీవల రాజ్యసభలో జ‌యా అమితాబ్ బ‌చ్చ‌న్ మాట్లాడాలంటూ..  డిప్యూటీ చైర్మన్ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్ పిలిచారు. ఆ స‌మ‌యంలో జ‌యా బ‌చ్చ‌న్ అస‌హ‌నానికి లోన‌య్యారు. తనను కేవ‌లం జ‌యా బ‌చ్చ‌న్ అని పిలిస్తే స‌రిపోతుంద‌న్నారు. మహిళలకు ప్ర‌త్యేక గుర్తింపు అంటూ లేదా? అని ఆమె ప్ర‌శ్నించారు. అయితే, ఇలా త‌న‌ను భ‌ర్త పేరుతో క‌లిపి పిల‌వ‌డానికి అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ రోజుల వ్య‌వ‌ధిలోనే ఆమె అదే పేరుతో తనను పరిచయం చేసుకుని రాజ్య‌స‌భ‌లో శుక్ర‌వారం కాసేపు సరదాగా న‌వ్వులు పూయించారు. 

స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీ జ‌యా బ‌చ్చ‌న్ మాట్లాడుతూ నిన్న మాట్లాడుతూ.. త‌న భ‌ర్త అమితాబ్ పేరుతో క‌లిపి 'జ‌యా అమితాబ్ బ‌చ్చ‌న్' అని తనను ప‌రిచ‌యం చేసుకున్నారు. దాంతో మొన్నటి ఘటన గుర్తొచ్చి, చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌ ఒక్క‌సారిగా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. 

ఆ సంద‌ర్భంలో ఎంపీలు ‌జైరామ్ ర‌మేశ్‌, రాఘ‌వ చ‌ద్దాలు కూడా నవ్వుతూ సరదాగా స్పందించారు. "మీరు లంచ్ బ్రేక్ తీసుకున్నారా? లేదా?.. అందుకే జైరామ్ ర‌మేశ్ పేరును ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్నార‌ని ధ‌న్‌క‌ర్‌ను ఉద్దేశిస్తూ జ‌యా అన్నారు. 'ఆయ‌న పేరు చెప్ప‌కపోతే మీకు తిన్న‌ది అర‌గ‌దేమో' అంటూ సరదాగా చురక కూడా అంటించారు. ఆ స‌మ‌యంలో ధ‌న‌క‌ర్ స్పోర్టివ్ గా స్పందిస్తూ.. ఇవాళ లంచ్ బ్రేక్ తీసుకోలేద‌ని, కానీ జైరామ్ తో కలిసి లంచ్ మాత్రం చేశాన‌ని చమత్కరించారు. దాంతో ఛైర్మ‌న్ మాటలు కూడా సభలో నవ్వులు పూయించాయి.

ఇక జులై 29న రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తనను 'జయా అమితాబ్ బచ్చన్' అని సంబోధించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. '"సార్, జయా బచ్చన్ అంటే సరిపోతుంది అని ఆమె చెప్పారు. "మహిళలు తమ భర్తల పేరుతో గుర్తించబడతారు. వారికి (మహిళలకు) వారి సొంత ఉనికి లేదా?" అని ఆమె అన్నారు.
Jagdeep Dhankhar
Jaya Bachchan
Rajya Sabha

More Telugu News