Nagababu: ఇది చిన్న సాయమే కావొచ్చు కానీ, ఇచ్చిన మాట మర్చిపోలేదు: నాగబాబు

Nagababu posts about his donation towards IAF families
 
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ సినీ నటుడు నాగబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. 

ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తూ ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకు తన వంతు సాయం చేస్తానని ఆపరేషన్ వాలెంటైన్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  మాటిచ్చానని వెల్లడించారు. ఇచ్చిన మాటకి గాను వారికి రూ.6 లక్షల సహకారం అందించానని తెలిపారు. 

"ఇది చిన్న సాయమే కావొచ్చు... పెద్ద గొప్పది కాకపోవచ్చు... కానీ ఇచ్చిన మాట మర్చిపోలేదన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. దేశ సేవలో ప్రాణాలర్పించిన వారికి తోడ్పాటు అందించే అవకాశం రావడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తాను" అంటూ నాగబాబు తన పోస్టులో వివరించారు.
Nagababu
Donation
IAF
Janasena
Andhra Pradesh
Tollywood

More Telugu News