Narendra Modi: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నరేంద్ర మోదీ
- 69 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలిచిన భారత ప్రధాని
- 63 శాతం ఓట్లతో రెండో స్థానంలో మెక్సికన్ ప్రధాని
- అట్టడుగు స్థానంలో జపాన్ ప్రధాని పుమియో కిషిడా
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మరోసారి ప్రధాని నరేంద్రమోదీ నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సంస్థ ర్యాంకులను విడుదల చేసింది. జులై 8 నుంచి 14వ తేదీ వరకు సేకరించిన డేటా ఆధారంగా ఈ ర్యాంకులను ఇచ్చారు. ఈ సర్వే ప్రకారం 69 శాతం ఓట్లతో భారత ప్రధాని నరేంద్రమోదీ మొదటి స్థానంలో నిలిచారు. 63 శాతం ఓట్లతో మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపేజ్ ఒబ్రేడర్ రెండో స్థానంలో ఉన్నారు.
25 మంది నాయకులతో కూడిన ఈ జాబితాలో జపాన్ ప్రధాని పుమియో కిషిడా చివరి స్థానంలో ఉన్నారు. ఆయనకు 16 శాతం ఓట్లు వచ్చాయి. గతంలో పలు గ్లోబల్ రేటింగ్స్‌లోనూ ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలవడం విశేషం.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 39 శాతం, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో 29 శాతం, బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ 45 శాతం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ 20 శాతం ఓట్లు మాత్రమే సాధించారు.
టాప్ 10 వీరే...
1. భారత ప్రధాని - నరేంద్ర మోదీ (69 శాతం ఓట్లు)
2. మెక్సికో అధ్యక్షుడు - ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ (63 శాతం)
3. అర్జెంటీనా అధ్యక్షుడు - జేవియర్ మిలీ (60 శాతం)
4. స్విట్జర్లాండ్ ఫెడరల్ కౌన్సిలర్ - వియోలా అమ్హెర్డ్ (52 శాతం)
5. ఐర్లాండ్ ప్రధాని - సైమన్ హారిస్ (47 శాతం)
6. యూకే ప్రధాని - కైర్ స్టార్మర్ (45 శాతం)
7. పోలాండ్ ప్రధాని - డోనాల్డ్ టస్క్ (45 శాతం)
8. ఆస్ట్రేలియా ప్రధాని - ఆంథోనీ అల్బనీస్ (42 శాతం)
9. స్పెయిన్ ప్రధాని - పెడ్రో శాంచెజ్ (40 శాతం)
10. ఇటలీ ప్రధాని - జార్జియా మెలోని (40 శాతం)